క్యారెట్…. అన్ని సీజన్లో లభించే వెజిటబుల్ ఇది. మానవుల ఆరోగ్య విషయంలో ఎంతగానో దోహదపడుతుంది. అన్ని కూరగాయలతో కంటే క్యారెట్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తీపిగా ఉండే అతి తక్కువ కూరగాయల్లో క్యారెట్ ఒకటి. ఎందుకంటే ఇది పచ్చిగా అయినా తినవచ్చు లేక ఉడికించుకొని ఆయన తినవచ్చు. క్యారెట్ ఎలా తీసుకున్న అందులోని పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. విటమిన్లు, ఖనిజలవణాలు, కాల్షియం,కాపర్, పొటాషియం , మాంగనీస్, ఫాస్పరస్, వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతే కాదు ఇందులోని ఆంటీ యాక్సిడెంట్లు కాన్సర్ నివారించడంలో ఉపయోగపడతాయి.ఇలా చెప్పుకుంటూ క్యారెట్ల ద్వారా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ల లో ఉండే పోషక విలువలు వాటి వలన జరిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్లలో యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్లు,ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు ఉన్నవారికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని పచ్చిగా,కానీ జ్యూసుల రూపంలో గానీ ప్రతిరోజు తీసుకోవడం వలన బరువును నియంత్రణలో ఉంచుకొన వచ్చు. క్యారెట్ లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది.
క్యారెట్ లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్ కాంపౌండ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి . దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన చర్మం చాలా కాంతివంతగా ఉంటుంది. అలానే ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి.
క్యారెట్ లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది. క్యారెట్ తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది.క్యారెట్ లో ఉండే ఫాల్కరినల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కాన్సర్ పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది.క్యారెట్ లో ఉండే పోలిక్ యాసిడ్,పిరిడాక్సిన్, టయామిన్ వంటివి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచుతాయి. అలానే కాలయంలో కొవ్వులు పేరకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది.క్యారెట్ తినడం వలన దంతాలు, చిగుళ్ళకు చాలా మేలు చేస్తుంది