కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన జబర్దస్త్ లేడి రీతు చౌదరి

-

జబర్దస్త్ కామెడీ షో గురించి దాదాపు తెలియని వారు ఉండరు. ఇక అందులో హైపర్ ఆది టీం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతు చౌదరి ఒకరు. పలు సీరియల్స్ ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో నటించింది. జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే రీతూ చౌదరి తాజాగా తనకు కాబోయే భర్త గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. తనకు కాబోయే భర్త ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు పరిచయం చేసింది. రీతూ చౌదరి కి కాబోయే భర్త పేరు శ్రీకాంత్. ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తమ బంధం కంటే ఏది బెటర్ కాదని క్యాప్షన్ పెట్టింది. ఆ క్యాప్షన్ చూస్తుంటే దాదాపు పెళ్లి ఖాయం అయినట్లుగా కనిపిస్తోంది. దీంతో రీతూ చౌదరి కి నెటిజన్లు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version