జడ్చర్ల మున్సిపాలిటీలోని ఎర్రగడ్డ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది ఇక వివరాలకు వెళితే ఇదివరకు ప్రభుత్వం నిర్మించిన 570 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకి అనుమతి లేకుండా నివాసం ఉంటున్న వాళ్ళని బుధవారం పోలీస్ ఫోర్స్ తో వచ్చి ఖాళీ చేయించారు అన్న సమాచారం వచ్చింది. అయితే డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో నివాసం ఉంటున్న వాళ్ళతో పాటుగా నిరుపేదలు ఎర్రగుట్ట వద్ద ఉన్న డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు దగ్గరికి వెళ్లారు.
గత పదిహేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తారని ఎదురు చూసినా ఎందుకు ఇల్లు కేటాయించలేదని తము కిరాయిండ్లకి అద్ద చెల్లించలేక గత 45 రోజుల నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో నివాసం ఉంటున్నామని ఇప్పుడు ఖాళీ చేయిస్తామంటే ఊరుకునేది లేదని మండిపడ్డారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో నివాసం ఉంటున్న వాళ్ళందరూ నిరుపేదలేనని ఎవరికి కూడా సొంత ఇల్లు లేవని అన్నారు తమ ని కాళీ చేయించడం కాదు తమకి ఇల్లు పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు.