పీయూష్ గోయల్ ఓ దురహంకారి, పెట్టుబడిదారుల ప్రతినిధి : జగదీశ్వర్ రెడ్డి

-

యాదాద్రి : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక వంకలతో తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణలో పండిన ప్రతీ వరి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తామని వెల్లడించారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దురహంకారి పెట్టుబడిదారుల ప్రతినిధిగా మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు జగదీశ్వర్ రెడ్డి. కేంద్రం వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు చెప్పాల్సింది పోయి తెలంగాణ పైన కక్ష సాధిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రమే వరి కొనాలని గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని స్థాయిలలో తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపుతామని వెల్లడించారు. ధాన్యం విషయంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సారథ్యంలో లో రైతుల పక్షాన ఉద్యమాలు చేస్తామని ప్రకటన చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version