మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ మీద సీరియస్ అవ్వడమే కాకుండా.. క్లారిఫికేషన్ కోసం టైం ఇచ్చినా.. తన తప్పు ఒప్పుకుని సారీ చెప్పకుండా నేను ఏం తప్పు మాట్లిడినా అని అనడం సరికాదని.. అందుకే స్పీకర్ చర్యలు తీసుకున్నారని వివరించారు.
అంతేకాకుండా తాను, సీతక్క సభలో పక్కపక్కనే కూర్చుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఫొటోలు తీశారని ఆరోపించారు.ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టేదుండే’ అని కేటీఆర్ అన్నారని గుర్తుచేశారు.
https://twitter.com/Telugu_Galaxy/status/1900442613364510847