దేశంలో ఎక్కడా జరగని రాజకీయాలు ఏపీలోనే జరుగుతాయని చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయమే వేరు. అసలు రాజధానిపై కూడా రాజకీయం నడుస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమే. ఇప్పటికీ ఇక్కడ రాజధాని ఏదో ప్రజలకు తెలియని పరిస్తితి. ఆ పరిస్తితిని తీసుకొచ్చింది పాలకులే అని చెప్పాలి. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలు తీసుకున్నారు.
దానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా మద్ధతు తెలిపారు. ఇక బాబు హయాంలో ఎక్కువ గ్రాఫిక్స్ నడిచిందని, అమరావతి అభివృద్ధి చెందలేదని, జగన్ వచ్చాక రాజధాని అభివృద్ధి చెందుతుందని అంతా ఆశించారు. కానీ జగన్ వచ్చాక అసలు రాజధాని లేకుండా పోయింది..ఆయన వచ్చి మూడు రాజధానులు చేస్తానని చెప్పారు. విశాఖ, అమరావతి, కర్నూలు అన్నారు. ఇక ప్రధానంగా ఇందులో విశాఖ రాజధాని అనేది మెయిన్. అదే టార్గెట్ గా ఆయన ముందుకెళ్లారు. అలాగే మూడు ప్రాంతాల్లో రాజకీయంగా కూడా తిరుగుండదని భావించారు.
మూడు రాజధానులు ప్రకటించి మూడేళ్లు దాటింది..కానీ ఇంతవరకు రాజధాని ఏది అనేది క్లారిటీ లేదు. అంటే పరిస్తితి రాష్ట్రంలో ఉంది. పైగా రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి..అదిగో త్వరలోనే విశాఖ నుంచి పాలన మోదలుపెడుతున్నామని చెబుతున్నారు. కానీ అక్కడకు వెళ్ళడం లేదు.
తాజాగా వైఎస్ వివేకా కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడతానని జగన్ చెప్పారు. అయితే అప్పుడైనా వెళ్తారా? లేదా? అనేది డౌట్. పైగా జగన్ విశాఖకు వస్తానంటే అక్కడి ప్రజలు ఏమి సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తమకు రాజధాని కంటే పరిశ్రమలు తీసుకురావడం, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కానీ అదేం జరగడం లేదు. కాబట్టి రాజధానిపై ఎంత రాజకీయం చేసిన జగన్‌కు ఉపయోగం ఉండదనే చెప్పాలి.