మా జగనన్న ఎప్పుడు చల్లగుండాలి – రోజా ఎమోషనల్‌

-

మా జగనన్న ఎప్పుడు చల్లగుండాలని మంత్రి రోజా ఎమోషనల్‌ అయ్యారు. నగరి సత్రవాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని రోజా తెలిపారు.

గతంలో సంక్షేమ పథకాలకోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవాళ్ళమని, ప్రస్తుతం అడగకుండానే, తిరగకుండానే ప్రతీ ది తమ గడప కి చేరుస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అక్కడ మంచి మనసున్న మన జగనన్నతో పాటు ఇక్కడ మాకు అన్ని చేస్తున్న మీరు చల్లగా వుండాలని ప్రజలు ఆశీర్వదిచడం సంతోషం కల్గించిందని వివరించారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ఈ కార్యక్రమం లో తమ సంక్షేమంకోరిన ప్రభుత్వం తమ గడపముందు వచ్చిందని ప్రజలు చూపించే ప్రేమ ఆప్యాయతలు వెలకట్టలేనిదని చెప్పారు రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version