కడుపు మంట ఉన్న వారికే సమ్మె కావాలి : జగన్‌ సంచలన వ్యాఖ్యలు

-

ఇవాళ జగనన్న చేదోడు పథకాన్ని చెందిన నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ప్రభుత్వం, ప్రజలు ,ఉద్యోగులు ఎవరూ కోరుకోవడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ, కడుపు మంట ఉన్న వారికే సమ్మె కావాలని ఫైర్‌ అయ్యారు.

CM Jagan Mohan Reddy

ఎర్రజెండాల వారికి, బాబు పుత్రులు, కొన్ని మీడియా సంస్థలకు సమ్మె కావాలని.. ఉద్యోగులు సమ్మె జరుతుందంటే వీరందరికీ పండుగే అంటూ నిప్పులు చెరిగారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదంటే నచ్చక కొందరు ఏడుపు మొహం పెట్టారని.. కమ్యునిస్టు సోదరులు ఉద్యోగులను ముందుకు తోసి ఆందోళన చేయిస్తున్నారని ఆగ్రహించారు.

పచ్చ జెండా ముసుగులో ఉన్న ఎర్రజెండా వారిని చంద్రబాబు ముందుకు తోశారని.. ఆశా వర్కర్లు రోడ్లపైకి వచ్చారని… ఆందోళన చేస్తున్నారని రాస్తున్నారని పచ్చ మీడియాపై ఫైర్‌ అయ్యారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ వారి ఆందోళనలకు కమ్యునిస్టులు మద్దతిస్తున్నారని.. మెరుగైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండాలు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారని ఆగ్రహించారు. సోషల్ మీడియాలో ఎవరేం రాసినా ప్రధాన వార్తగా ప్రచురించి చూపిస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version