ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ విభజన అంశంపై రాజ్యసభలో ప్రస్తావించారు ప్రధాని మోదీ. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని అన్నారు. నేను తెలంగాకు వ్యతిరేఖం కాదని.. అయితే విభజనకు అనుసరించిన పద్దతి సరైందిగా లేదని ఆయన అన్నారు. తెలంగాణ- ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. కనీసం చర్చ కూడా జరుగకుండా.. విభజన బిల్లును ఆమోదించారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
నిన్న లోక్ సభలో కాంగ్రెస్ పార్టీని విమర్శించిన ప్రధాని…నేడు రాజ్య సభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. దేశంలో ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోెతకు కాంగ్రెస్ కారణం అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్పై ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఆపార్టీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.