40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని తన నయా స్కెచ్ లతో ముప్పుతిప్పలు పెడుతున్నాడు వైయస్ జగన్. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చంద్రబాబును రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు టిడిపి పార్టీ పునాదులు కదిలిపోయే విధంగా జగన్ గెలవడం జరిగింది. అధికారంలోకి రావటం తోనే ఆర్థికంగా టిడిపికి అండగా ఉన్నవారిని ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ సైలెంట్ గా కూర్చో పెడుతున్నారు. ఇదే సమయంలో టిడిపి పార్టీ గట్టిగా ఉండే నియోజకవర్గాలపై దృష్టి సారించారు.
దీనిలో భాగంగా చింతపూడి, గోపాలపురం, దెందులూరు నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కమ్మలకు ప్రాధాన్యం పెంచారు. పోలవరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇదే సమయంలో మెట్ట ప్రాంతాలలో నాలుగు ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ లో ఉన్న కమ్మ వర్గానికి చెందిన వారికి ఎంపీ శ్రీధర్ దూకుడు పెంచుతూ వారికి చెక్ పెట్టడం జరిగింది. మరోపక్క పశ్చిమలో బలమైన సామాజిక వర్గం క్షత్రియ మరియు బీసీ నాయకులు సైతం వైసీపీకి మద్దతుగా ఉండే విధంగా ఆ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి క్యాబినెట్ బెర్తులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ విధంగా కుల రాజకీయాలు చేసే చంద్రబాబుకి ఆ కులలో టీడీపీ కి పట్టు లేకుండా జగన్ రాజకీయ ఎత్తుగడలతో దూసుకుపోతున్నారు.