ఆదానీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేము – ఏపీ ప్రభుత్వం

-

ఆదానీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేమని ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పుడు దేశంలో ఎక్కడా చూసినా, ఆదానీ పేరే వినిపిస్తోంది. ఆదానీ ఆస్తులన్నీ తరిగిపోతున్నాయి. అన్ని కంపెనీలు నష్టపోతున్నాయి. దీంతో ఆదానీ కంపెనీ అందరూ తెగదెంపులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే, ఆదానీపై కీలక వ్యాఖ్యలు చేసింది జగన్‌ సర్కార్‌.

‘ఆదానీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేము. వాళ్లకు కొత్తగా ఏమీ ఇవ్వడం లేదు. ఇప్పుడున్న వాటికే పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద ఇచ్చే రాయితీలు మాత్రమే ఇచ్చాం’ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. ఆదాని గ్రూప్ పై అంతర్జాతీయంగా, పార్లమెంటులో తీవ్ర చర్చ జరుగుతోందని, దాన్ని షేర్ హోల్డర్లు అయోమయంలో ఉన్నారని, ఆదానీపై పునరాలోచన చేయాలి కదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రిపై విధంగా స్పందించారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వివరించే సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version