ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఏకంగా 5,18,740 ట్యాబ్ లను కొనుగోలు చేసేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇవ్వనున్న ప్రభుత్వం.. బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ ల పంపిణీకి కసరత్తు చేస్తోంది.విద్యా కానుక పై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్నిరకాల వస్తువులూ అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామని సీఎం జగన్‌కు వివరించారు అధికారులు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యా కానుక కచ్చితంగా అందాలి…యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలన్నారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను నిరంతరం యాక్టివేట్ చేయాలి…స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణల పై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలన్నారు.
గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకు రావాలన్నారు. ఎప్పకప్పుడు విలేజ్ క్లినిక్ ద్వారా నివేదికలు పంపించాలి..నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు.