సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. శనివారం మంగళగిరిలో జరిగిన టిడిపి లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తామని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుపట్టారు. సుప్రీంకోర్టులో ఉన్న రాజధాని అంశంపై గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో మాట్లాడడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందన్నారు.
జగన్ పై కోర్టు ధిక్కరణ కేసు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తాను 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటినుండి తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూసాను కానీ.. ఇటువంటి పరిస్థితులను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నేతలు 40 వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం అందరూ దివాలా తీశారని, కోర్టులు మాత్రం కలకలలాడుతున్నాయని సెటైర్లు వేశారు.