ఎల్బీనగర్‌ పోరు రసవత్తరం..రేవంత్ బరిలో ఉంటారా?

-

తెలంగాణలో ఏపీ నుంచి వచ్చి సెటిలైన ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎల్బీనగర్ కూడా ఒకటి. హైదరాబాద్ పరిధిలో ఉండే ఈ స్థానంలో ఏపీ సెటిలర్ల ప్రభావం ఎక్కువ వారే గెలుపోటములని ప్రభావితం చేయగలరు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఎల్బీనగర్ కొత్తగా ఏర్పడింది. ఆ తర్వాత 2009లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డి విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో ఏపీలో టి‌డి‌పి హవా నడిచింది..దీంతో ఆ ప్రభావం ఎల్బీనగర్ పై పడింది. అక్కడ టి‌డి‌పి సత్తా చాటింది. టి‌డి‌పి నుంచి బి‌సి నాయకుడు ఆర్ కృష్ణయ్య గెలిచారు.

ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు గాని..నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు.  అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడిచింది. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ తో టి‌డి‌పి పొత్తు ఉంది. ఆ ప్రభావంతో ఎల్బీనగర్ లో మరోసారి కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి గెలిచారు. కానీ రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావడం..కే‌సి‌ఆర్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి బి‌ఆర్‌ఎస్ లో చేరిపోయారు.

అయితే బి‌ఆర్‌ఎస్ లో చేరాక అక్కడ ఆధిపత్య పోరు పెరిగింది. బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్ మోహన్ గౌడ్, సుధీర్ రెడ్డిలకు పడని పరిస్తితి. అలాగే ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డికి కాస్త నెగిటివ్ వస్తుంది. అటు బి‌జే‌పి బలం పెరుగుతుంది. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. టి‌పి‌సి‌సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తారని ప్రచారం ఉంది. కానీ ఆయన కొడంగల్ బరిలోనే దిగుతారు. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో చూడాలి.

అయితే ఈ సారి ఎల్బీనగర్ లో మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయి. బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్-బి‌జే‌పిల మధ్య పోరు జరగనుంది. అయితే టి‌డి‌పి కూడా ఇప్పుడుప్పుడే యాక్టివ్ అవుతుంది. అక్కడ టి‌డి‌పికి కాస్త బలం ఉంది. ఆ పార్టీ ఓట్లు చీల్చే ఛాన్స్ ఉంది. దీని వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version