తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. నమూనా ఇంటిని పరిశీలించిన సీఎం జగన్ కి ఇంటి నిర్మాణం తీరు, ఖర్చు వివరాలను వివరించారు అధికారులు. పేదలకు ఇచ్చే ఇంట్లోని సదుపాయాలు స్వయంగా పరిశీలించిన సీఎం జగన్, అనంతరమ పేదలకు ఇళ్లు నిర్మాణం పైలాన్ ను ఆవిష్కరించారు. ఇవాళ నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ సాగనుంది.
ఏపీ వ్యాప్తంగా 23 వేల 535 కోట్ల మార్కెట్ల విలువైన భూమిని మొత్తం 68 వేల 361 ఎకరాలని పేదలకు భూమి పంపిణీ చేయనున్నారు. 30 లక్షల 75 వేల 755 మంది లబ్ధిదారులకు పట్టాలు అందచేయనున్నారు. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు పట్టాల పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు 50 వేల 940 కోట్లతో 2 దశల్లో పక్కా ఇళ్లు అందచేయనున్నారు. రెండో దశలో మొత్తం 28.31 లక్షల ఇళ్లు పంపిణీ చేయనున్నారు. మొదటి దశలో 28 వేల కోట్లతో 15.6 లక్షల ఇళ్లు, 2.62 లక్షల టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్లు అందచేశారు. మొత్తం 1.43 లక్షల మంది టిడ్కో లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూపాయికే 300 చదరపు గజాల భూమి అందచేయనున్నారు.