తెలంగాణా ప్రయోజనాల విషయంలో గాని అక్కడి ప్రజల మనోభావాల విషయంలో గాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడా వెనకడుగు వేయరు. రాజకీయంగా ఆయన ఎంత బలంగా ఉన్నా సరే తెలంగాణా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. కరోనా విషయంలో ఏదో బిళ్ళ వేసుకుంటే ఇబ్బంది ఉండదు అని చెప్పిన కెసిఆర్, ఆ తర్వాత ముందు జాగ్రత్త చర్యలను కాస్త ఎక్కువగానే తీసుకున్నారు.
ప్రజలను ఎక్కడిక్కడ అప్రమత్తం చేయడమే కాకుండా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. దేశ విదేశాల నుంచి వచ్చేవారికి హైదరాబాద్ ఒక కేంద్రం. వైరస్ విస్తరణ ప్రమాదం ఎక్కువ. అందుకే, అక్కడ విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. జిమ్‌లు, పబ్బులు మూసివేశారు. మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాని జగన్ మాత్రం అలా కనపడటం లేదు. అధికారులు హడావుడి కూడా చేయడం లేదు.
రాష్ట్రంలో కరోనా ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే జగన్ సర్కార్ మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కర్ణాటకలో తుమ్మితే ఏపీకి కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే జగన్ సర్కార్ మాత్రం జాగ్రత్తల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుంది. రివ్యు మీటింగ్ అనేది కూడా ఎక్కడా జరగలేదు. దీనితో ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.