విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో జగన్ భేటీ..గంట పాటు సుదీర్ఘంగా !

-

విశాఖ ఎయిర్పోర్ట్ లో సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. సుమారు గంటకు పైగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. 4 అంశాలపై సీఎం జగన్ తో స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు చర్చ జరిగినట్లూ చెబుతున్నారు. సమావేశం అనంతరం శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలకు సీఎం జగన్ బయలుదేరి వెళ్లారు. ఇక సీఎం తో సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు నరసింగ్ రావు, అయోధ్య రామ్, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్,గంధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు 3 పేజీల వినతిపత్రం అందచేశారు. వినతి పత్రం లో ఫోర్ పాయింట్ ఫార్ములా పేర్కొన్నట్టు సమాచారం.

స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణను అడ్డుకోవాడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతకైనా తెగించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. NMDC ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వారు కోరుతున్నారు. ఏపీ తరపున ఎంపికైన ఎంపీలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వ్యతిరేకత స్వరం వినిపించాలని వారు కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో 66 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఉంది. అటువంటి గనులను కేటాయించడం వల్ల మరో రెండు వేల సంవత్సరాల వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎటువంటి డోకా ఉండదని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version