తల్లిదండ్రులు, పోలీసులు ఒక్కటే : ఎన్టీఆర్

-

సైబరాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన ఎన్టీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను ఇక్కడికి నటుడిగా రాలేదు రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయిన బాధితునిగా వచ్చానని అన్నారు. మా కుటుంబం ఇద్దరిని కోల్పోయిందన్న ఆయన ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా వాహనాలను నడిపే మా అన్న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని అలాగే 33 వేల కిలోమీటర్లు మా తాత ఎన్‌టీఆర్‌ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రమాదం జరగకుండా నడిపిన మా నాన్న హరికృష్ణ ఇదే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని అన్నారు.

ntr

ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు పొంచి ఉంటాయన్న ఆయన ఇంట్లోకి బయటికి వచ్చినప్పుడు దయచేసి కుటుంబ సభ్యులను గుర్తు తెచ్చుకోండని అన్నారు. మీ రాక కోసం ఎదురు చూసే వారిని గుర్తు తెచ్చుకోండని ఆయన కోరారు. శిక్షలు వేసినంత మాత్రాన మార్పు రాదన్న ఆయన బాధ్యతగా మనల్ని మనం మార్చుకున్నప్పుడే మార్పు వస్తుందని అన్నారు. పౌరులందరూ సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని, బాధ్యతారహితంగా పౌరులు ప్రవర్తించవద్దన్నారు. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటామో, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుకుంటామో అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. తల్లిదండ్రులను మనం ఎలా గౌరవిస్తామో పోలీసులను అదే విధంగా గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version