ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి రద్దు విషయంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలిన తెలిసిందే. రాజధాని బిల్లుని అడ్డుకుని అనవసరంగా ఇరుక్కుపోయాము అనే భావన తెలుగుదేశం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న తరుణంలో జగన్ ని తక్కువ అంచనా వేశామని పార్టీ అంతర్గత సంభాషణల్లో నేతలు అసహనం కూడా వ్యక్తం చేయడం చంద్రబాబు ని కూడా ఇబ్బంది పెడుతూ వస్తుంది.
ఇక ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాలు త్వరలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మండలిని సమావేశ పరచవద్దు అని జగన్ భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సీనియర్ నేతలు కూడా జగన్ కి పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో తమకు ఉన్న బలంతో అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలని, శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ విషయాన్నీ కూడా ప్రస్తావించాలని టీడీపీ భావిస్తుంది.
దీనితో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం ప్రోరోగ్ ఆఫ్ ఈచ్ హౌస్-కమెన్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ఉన్నట్లు చెబుతున్నారు. నియమావళి ప్రకారం ఏ సభకు ఆ సభను విడి విడిగా సమావేశపరవచ్చు లేదా వద్దు అనుకుంటే వాయిదా వేయవచ్చు కాబట్టి దీనిని వాయిదా వెయ్యాలని టీడీపీ భావిస్తుంది. ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభను మాత్రమే సమావేశ పరిచే విధంగా గవర్నర్ ని కోరే అవకాశం ఉందని.
ఈ మేరకు బడ్జెట్ సమావేశాలకు ముందే జగన్ ని కలవాలని జగన్ భావిస్తున్నారు. సీనియర్ మంత్రులతో వెళ్లి జగన్ గవర్నర్ ని కలిసే అవకాశం ఉంది. అయితే మండలి రద్దు బిల్లుని కేంద్రం ఆమోదించలేదు కాబట్టి ఇంకా మండలి కొనసాగుతుంది అని టీడీపీ నేతలు ధీమాగా చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు మండలి వ్యవహారం టీడీపీ కి చికాకుగా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.