2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్త అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీంతో చాలామంది రాష్ట్రంలో ఉన్న కాపులు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడంతో అధికారం లోకి చంద్రబాబు రావటంతో కాపులను బీసీల్లో చేరుస్తానన్న హామీ విషయంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నిర్లక్ష్యం వహించడంతో కాపు నేత ముద్రగడ ఉద్యమం చేసి తుని లో సంచలనం రేపటం జరిగింది.
అయితే ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీపై కాపులకు తీవ్రమైన వ్యతిరేకత మొదలవుతుంది అన్న భావనకు వచ్చిన చంద్రబాబు వెంటనే తన అధికార బలంతో పోలీసుల చేత ముద్రగడ ఉద్యమాన్ని అణచి వేయడం జరిగింది.
ఇటువంటి నేపథ్యంలో వైయస్ జగన్ 2019 ఎన్నికల సమయంలో కాపుల రిజర్వేషన్ గురించి ఎక్కువగా కాపులు ఉండే గోదావరి జిల్లాలో పర్యటిస్తూ చాలా క్లారిటీ గా చెప్పటంతో కాపు రిజర్వేషన్ అనేది తన పరిధిలో లేదని చెప్పటంతో కల్లబొల్లి మాటలు లేకుండా స్ట్రైట్ గా రాజకీయాలు చేయడంతో ప్రస్తుతం ముద్రగడ కాపు రిజర్వేషన్ హామీ గురించి గానీ కాపు కార్పొరేషన్ నిధులు గురించి గాని వైయస్ జగన్ ని ప్రశ్నించలేని పొజిషన్ లో ఉండటంతో…చాలామంది రాజకీయ మేధావులు ముద్రగడ ని వైయస్ జగన్ డీల్ చేసినట్టు చంద్రబాబు చేయలేకపోయారు జగన్ ని చూసి చంద్రబాబు నేర్చుకోవాలి స్ట్రైట్ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో బెనిఫిట్స్ ఎలా ఉంటాయో అంటూ కామెంట్ చేస్తున్నారు.