ఈ మధ్యనే ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికారంలో ఉన్న వైసీపీ గ్రాడ్యుయేట్ కోట ఎన్నికల్లో 3 మరియు ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ ని టీడీపీకి కోల్పోవడం తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం తాడేపల్లి సీఎం ఆఫీస్ లో వైసీపీ ప్రజాపరతినిధులతో మీటింగ్ పెట్టిన సీఎం జగన్ స్పందించారు. మన ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన మొత్తం కుటుంబాలు 80 లక్షల మంది.. అయితే ఈ లక్షలలో కేవలం 2.5 లక్షల ఓటర్లు మాత్రమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో మనకు దక్కిన ఓటమిని దేనికీ కొలమానంగా ఉదాహరణగా తీసుకొనవసరం లేదు అంటూ చెప్పారు. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లో టీడీపీ గెలిచిన తీరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వలన కాదు అన్నారు జగన్. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే మనం మాత్రం ఒంటరిగా పోటీకి వెళ్ళాము అంటూ బోలెడంత సపోర్ట్ ను మనోధైర్యాన్ని నేతలకు కల్పించారు సీఎం జగన్.