ఏపీ రైతులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోళ్లు కోసం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ. 5వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీ కేబినెట్ అనుమతి తీసుకుంది. రైతుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా నిర్ణయం ఏపీ కేబినేట్. ఇప్పటి వరకు 21.83 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ చేసింది ఏపీ ప్రభుత్వం.
అయితే.. వాటికి సంబంధించిన రూ.2150 కోట్ల చెల్లింపులను 21 రోజుల్లో రైతులకు అందించాలని నిర్ణయం తీసుకుంది కేబినేట్. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో కీలక మార్పులుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు కల్పిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓటీఎస్ కింద చెల్లించాల్సిన రుసుములుకు సంబంధించిన సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.రుణం తీసుకుని చెల్లించకున్నా, అలాంటి ఆస్తి చేతులు మారినా ఒకే స్లాబ్ వర్తింపు జేస్తూ తీసుకున్న తీర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.