తల్లి అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా

-

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చొప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు తన హాట్‌ అందాలతో అందరినీ కనివిందు చేస్తుంది ఈ భామ. అయితే.. ప్రియాంకకు బేబీ బంప్‌ కూడా కనిపించలేదు. కనీసం తను ప్రెగ్నెంట్‌ అని కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ.. ప్రియాంక చోప్రా తల్లయింది. అవును.. ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని భార్య భర్తలు ఇద్దరూ అధికారికంగా ప్రకటన చేశారు.

” సరోగసీ ద్వారా ఓ బేబీకి మేం జన్మనిచ్చాం. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక సమయంలో మేం కాస్త ప్రైవసీ కోరుకుంటున్నాం. ఫ్యామిలీ పై మరింత ఫోకస్‌ పెట్టబోతున్నాం. ” ఇలా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ప్రియాంక చోప్రా ఫైనల్‌ చేసేసింది. అయితే.. ప్రియాంక చోప్రా కు పుట్టింది ఆడ బిడ్డానా లేక.. మగ బిడ్డానా అనే విషయం వారు బయట పెట్టలేదు. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version