ఏపీ అటవీ శాఖ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త

-

అటవీశాఖలో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేసే ఉద్యోగులకు స్థానచలనం కలిగించాలని.. జిల్లాల విభజన తరువాత అన్ని డివిజన్లు, సర్కిళ్ళలో సిబ్బంది సంఖ్యను క్రమబద్దీకరించాలని ఆదేశించారు మంత్రి పెద్దిరెడ్డి.హేతుబద్దంగా పోస్ట్ లు ఉండేలా చూడాలి.. రాష్ట్రంలో ప్రతి యుఎల్ బి పరిధిలో ఒక నగరవనం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.18.02 కోట్లతో ఆరు నగర వనాలు అని.. ఎకో టూరిజం కోసం రూ.15 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. రాష్ట్రంలో 49,732 హెక్టార్లలో ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్త నగరవనాల ఏర్పాటుతో పాటు.. పులికాట్, నేలపట్టు, కోరంగి, పాపికొండలు ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేయాలని వెల్లడించారు. అరకు ప్రాంతంలో జంగిల్ రిసార్ట్స్ ఏర్పాటుపై దృష్టి సారించాలి… నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం ప్లాంటేషన్ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version