మొన్నటి వరకు ఎన్నికలు అంటే డబ్బులు మరియు మద్యం ప్రభావం విపరీతంగా ఉండేది. ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ రెండే. ఎలక్షన్ లో ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓటు వేసే విధంగా గెలిపించే విధంగా ఓటరు యొక్క ఆలోచనా విధానం ఉండేది. దీంతో ఆ విధంగా గెలిచిన ప్రభుత్వాలు కూడా అదే రీతిలో పని చేసేది. అయితే ఇటువంటి వాతావరణాన్ని మార్చటానికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నడుంబిగించారు.
ఈ చట్టం రాకముందు ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి తమకు పట్టు ఉందని నిరూపించుకోవాలని అనుకున్నారు. కానీ జగన్ తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఇలాంటివి ఇకపై అక్కడ కుదరదు. ఇందుమూలంగానే జేసి దివాకర్ రెడ్డి మరి కొంతమంది నాయకులు ఇప్పటికే చేతులెత్తేయడం జరిగింది.