జగన్, షర్మిల ఆస్తి పంచాయితీ మీకెందుకు : సీపీఐ నారాయణ

-

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆస్తి తగాదాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అన్నాచెల్లెళ్ళ పంచాయితీలో ఇతరుల జోక్యం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ విజయమ్మ ఈ తగువులో ఇప్పటికే స్పందించిందని గుర్తుచేశారు.

అన్నాచెల్లెళ్ళు వారి మధ్య తలెత్తిన వివాదాన్ని సొంతంగానే పరిష్కరించుకోగలరని చెప్పారు. అది రాజకీయ వివాదం కాదని, ఇతరులు దీన్ని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. అందరూ నోరు మూసుకోవాలన్నారు. బయటవారు అన్నాచెల్లెళ్ళ ఆస్తి తగాదాల్లో మాట్లడటం సమంజసం కాదని చెప్పారు. జగన్, షర్మిల ఇద్దరు తెలివైన వారేనని, న్యాయస్థానానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే పరిష్కరించుకోవాలని సూచించారు.అవసరమైతే విజయమ్మ జోక్యం చేసుకుని ఈ వివాదానికి తెరదించుతారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version