తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఇవాళ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. అయితే.. చంద్రబాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగానే.. తెలుగు దేశం పార్టీ నేతలు ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు.
అయితే.. ఎప్పుడూ లేని విధంగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి… కూడా చంద్రబాబు కు కరోనా సోకడంపై స్పందించారు. కరోనా సోకిన చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అటు విజయ సాయిరెడ్డి కూడా చంద్రబాబుకు కరోనా సోకడంపై తన స్టైల్ లో స్పందించారు. “యాదృచ్ఛికమే అయినా, ఎన్టీఆర్ వర్థంతినాడు చంద్రబాబుకు కరోనా సోకటం బాధాకరం. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిగానీ, టీడీపీ వ్యవస్థాపకుడికి బాబు పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుంటుంది.” అంటూ ట్వీట్ చేశారు. కాగా నిన్నటి రోజునే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.
Wishing a speedy recovery & good health for Sri @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 18, 2022