ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. 11న విద్యా దీవెన డబ్బులు జమ

-

ఈనెల 11న విద్యాదీవెన పథకం ద్వారా సాయం జమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం టూర్‌ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మంత్రి మేరుగ నాగార్జున, డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్‌ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్‌జిందాల్‌ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. బాపట్లలోని ఇంజినీరింగ్‌ కళాశాల, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల ప్రాంగణాల్లో సభావేదిక ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు.

వ్యవసాయ కళాశాలలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విద్యాదీవెన పథకం చాలా గొప్పదని, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయించిన తేదీకే సంక్షేమ పథకాలను అమలు చేయటం సీఎం
జగన్‌కే సాధ్యమైందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version