ఓటీఎస్ పై జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. 8.26 ల‌క్ష‌ల మందికి రిజిస్ట‌ర్ డాక్యుమెంట్లు

-

ఇవాళ త‌ణుకులో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి… ఓటీఎస్ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… రెండున్నరేళ్ల కాలంలో 31 ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చామ‌ని… ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభం అయ్యాయని వెల్ల‌డించారు. ప్ర‌తి మ‌హిళ చేతిలో రూ. 5-10 ల‌క్ష‌ల వ‌ర‌కు నేరుగా చేతుల్లో పెడుతున్నామ‌ని… ఓటీఎస్ ద్వారా 8.26 ల‌క్ష‌ల మందికి నేటి నుంచి రిజిస్ట‌ర్ డాక్యుమెంట్లు ఇస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. నేటి నుంచి వారి ఇంటిపై సంపూర్ణ హ‌క్కులు క‌ల్పిస్తున్నామ‌ని.. వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.

నా పుట్టిన రోజు నాడున 50 లక్షల మంది పైగా లబ్ది చేకూరేలా ఈ పధకానికి శ్రీకారం చుట్టానని.. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. ఒక సుదీర్ఘ కాలం పడిన క ష్టానికి సజీవ సాక్షమ‌ని తెలిపారు. త‌మ‌ ప్రభుత్వం లో ఇప్పటి వరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపి ణీ చేశామ‌ని.. 31 లక్షల ఇళ్ల స్థలాల విలువ 26 వేల కోట్లు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version