జగపతి బాబు సింహస్వప్నం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చెయ్యడం విశేషం. గాయం సినిమాతో జగపతి బాబు తొలి హిట్ కొట్టాడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో వచ్చిన శుభలగ్నం జగపతి బాబుకి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు.
ముఖ్యంగా జగపతిబాబుకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది అనడంలో సందేహం లేదు. ఇక ఈయన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే థియేటర్ల దగ్గర క్యూలైన్‌లో ఫ్యామిలీస్ ఎక్కువగా కనిపించేవారు.
ఎస్ఎస్ రాజమౌళి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శకత్వ ప్రతిభకు రికార్డులు బద్దలు కావాల్సిందే. అయితే రాజమౌళి శాంతి నివాసం అనే ఎపిసోడ్ సీరియల్ ద్వారా డైరెక్టర్ గా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వెండితెరపై ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు రాజమౌళి. ఇక ఆ తర్వాత మగధీర సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా చలామణి అవుతున్నారు. ఇక అంతేకాదు ఇటీవల మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నారు.
హీరో జగపతి బాబు, ఎస్ఎస్ రాజమౌళి చాలా దగ్గరి బందువులనే విషయం చాలామందింకి తెలియదు. రాజమౌళి కొడుకు కార్తికేయ రాజమౌళి సినిమాల ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఆకాశవాణి సినిమా నిర్మించిన ఇతడు వివాహం కూడా చేసుకున్నాడు. కార్తికేయ తన స్నేహితురాలు పూజా ప్రసాద్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక పూజా ప్రసాద్ ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు సోదరుని కూతురే పూజా ప్రసాద్. జగపతి బాబు సోదరుడైన రామ్ ప్రసాద్ పూజ తండ్రి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ అనేక విషయాలు పంచుకున్నారు. రాజమౌళి తనకు వియ్యంకుడవుతాడని చెప్పుకొచ్చాడు.
మరోవైపు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ రోల్స్ తో బిజీ అవుతున్నారు.లెజెండ్, రంగస్థలం, అరవింద సమేత సినిమాలలో విలన్ పాత్రలను జగపతి బాబు అద్భుతంగా పోషించారు. విచిత్రమేమిటంటే జగపతి బాబు, రాజమౌళి ఒక్క సినిమాలో కూడా విలన్ పాత్ర చెయ్యలేదు. మీరు మరీ అందంగా ఉంటారో లేక మీ మంచితనం వల్లో విలన్ రోల్ లో పెట్టుకోలేదని రాజమౌళి తనతో అన్నట్లు అన్నారని జగపతిబాబు తెలిపారు. తాను విలన్ రోల్స్ మాత్రమే కాదని ఎలాంటి రోల్స్ అయినా చేస్తానని ఆయనతో అన్నానని జగపతిబాబు చెప్పుకొచ్చారు.
రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతారు. మరి రాబోయే సినిమాల్లోనైనా జగపతి బాబును పెట్టుకుంటే మరో అద్బుతమైన విలన్‌ను చూసే అవకాశం దొరుకుతుంది.