BRS లోకి వెళ్లే ప్రసక్తే లేదు: జగ్గారెడ్డి

-

తెలంగాణాలో మరో వారం రోజుల్లో జరగనున్న ఎన్నికలపై ఇప్పటికే ఒక అంచనాను రాజకీయ నాయకులూ కలిగి ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. కాంగ్రెస్ మరియు BRS ల మధ్య చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్న మాట తెలిసిందే. ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తోందని జగ్గారెడ్డి అన్నారు. TV9 తో మాట్లాడుతూ జగ్గారెడ్డి వారడిగిన ప్రశ్నకు ఎన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ BRS లోకి వెళ్లే ఛాన్స్ లేదంటూ కొట్టిపారేశాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా నాపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటూ ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. గత తొమ్మిది సంవత్సరాలుగా సీఎం గా ఉన్న కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదంటూ జగ్గారెడ్డి విమర్శించారు.

ఇక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఖచ్చితంగా 70 స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. ఇక BRS తట్టా బుట్ట సర్దుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ జగ్గారెడ్డి చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version