200 లీటర్ల పాలను 1000 లీటర్లు చేశా: మల్లారెడ్డి

-

తెలంగాణాలో ఎన్నికలకు మరో వారం మాత్రమే ఉండడంతో రాజకీయంగా ఆధిక్యత కోసం సీనియర్ నేతలు ప్రచారంలో తమ ప్రదర్శనను చూపిస్తున్నారు. ఈ ప్రచారాలలో పాల్గొంటున్న మంత్రి మల్లారెడ్డి తన జీవితంలోని కొన్ని వత్త్సవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈయన మాట్లాడుతూ.. ఒక రోజుకు అప్పట్లో వెయ్యి లీటర్ల పాలు అమ్మిన చరిత్ర నాదంటూ ఆసక్తికర విషయాన్నీ చెప్పారు మల్లారెడ్డి. ఆ సమయంలో నేను పాలల్లో నీళ్లతో పాటు పాల పొడి కూడా కలిపేవాడినంటూ సీక్రెట్ బయట పెట్టేశాడు మల్లారెడ్డి. ఆ రోజుల్లో చిన్న చిన్న వెండర్ల నుండి రోజుకు లీటర్ల పాలు సేకరించేవాడిని, ఆ తర్వాత వాటిలో ఆస్ట్రేలియా నుండి తీసుకువచ్చిన పాల పొడి ను కలిపి వ్యాపారాన్ని చేశానంటూ మోసాన్ని బయటపెట్టారు మల్లారెడ్డి.

అయితే నేను పూలు అమ్మడం కూడా చేశానని అందులో మాత్రం ఏ మోసం చేయలేదని ఒప్పుకున్నాడు మల్లారెడ్డి. ఇక కాంగ్రెస్ నుండి చాలా మంది నేతలు వద్దన్నా BRS లోకి వస్తున్నారంటూ కామెంట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version