విద్యార్థులను సుమన్ చంపినట్టు నాకు కొన్ని లేఖలు వచ్చాయి : జగ్గారెడ్డి

-

ప్రభుత్వ విప్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే డప్పు కొట్టి ఎమ్మెల్యే అయ్యావని, ఇంకా డప్పు కొట్టి మంత్రి అవుదాం అనుకుంటున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ మెప్పు కోసం స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, సుమన్‌కి దమ్ము ఉంటే ఆర్ట్స్ కాలేజీ ముందు కు గన్ మెన్ లు లేకుండా రా..? అని సవాల్‌ విసిరారు. అంతేకాకుండా ఇద్దరూ ముగ్గురు విద్యార్థులను సుమన్ చంపినట్టు నాకు కొన్ని లేఖలు వచ్చాయని, చంపి.. ఆ డెడ్ బాడీ చేతులతో లేఖలు రాసి సమన్ పెట్టారని నాకు సమాచారం ఇచ్చారని జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు.

మా ప్రభుత్వం వస్తే విచారణ జరిపిస్తామని, సుమన్ నీ విడిచి పెట్టామన్నారు. మా విద్యార్ది సంఘాల నాయకులే చూసుకుంటారని, పెద్దోళ్లను అని పెద్దోడు అవ్వాలని చూస్తున్నాడని, యూనివర్సిటీ విద్యార్థుల కోసం నీ విశ్వాసం అమ్ముకున్నవా..? సుమన్ అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ దగ్గర మెప్పు కోసం మర్డర్ లు చేసిన నువ్వా..? మాట్లాడేది అంటూ ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్‌కి రాహుల్ గాంధీ పట్ల గౌరవం ఉంటే అనుమతి ఇస్తారని, విద్యార్ది సంఘాల నుండి వచ్చిన నువ్వు విద్యార్థుల కోసం కొట్లడుతవా… కేసీఆర్‌కి భజనే చేస్తావా..? అని ఆయన ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version