కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న జగ్గారెడ్డి !

-

కాంగ్రెస్ పార్టీ… పేరుకు జాతీయ పార్టీ అయిన ప్పటికీ.. ఎప్పుడు సొంత నేతల్లో వివాదం చెలరేగితే ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ నేతలు కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు నాయకులు. ఇందులో మొదటి నుంచి జగ్గారెడ్డి… రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లిలో రచ్చబండ నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయాన్ని జగ్గారెడ్డి పూర్తిగా తప్పుబట్టారు. తన జిల్లాలో ఉన్న ఎర్రవల్లిలో కార్యక్రమాన్ని నిర్వహించే ముందు… తన అభిప్రాయాన్ని కచ్చితంగా అడగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజీనామా దిశ‌గా జ‌గ్గారెడ్డి అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. కేవలం ఐదు రోజుల్లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తానని నేతలతో జగ్గారెడ్డి ప్రకటన చేశారు. సంగారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ స‌త్తా ఏమిటో తేల్చుకోవాల‌ని తోటి నేతలకు స‌వాల్‌ విసిరారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో హుజురాబాద్ కంటే త‌క్కువ ఓట్లే వ‌స్తాయ‌ని పేర్కొన్నారు జ‌గ్గారెడ్డి. ఇక జ‌గ్గారెడ్డి రాజీనామా స్టేట్మెంట్ పై ఆయనను కొంద‌రు కాంగ్రెస్ పార్టీ నేత‌లు బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version