ఈ మధ్య కాలంలో కొన్ని ప్రమాదాలు చూస్తోంటే అసలు రోడ్డు ఎక్కాలంటేనే భయం వేస్తోంది. అందుకే రోడ్డు ఎక్కుతున్నారంటేనే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒక కారు ఢీకొంటే ఒక వ్యక్తి… 30 అడుగుల దూరంలో పడ్డం అదీ ఓ రెండస్తుల భవనంపై పడ్డం అనేది ఎవరైనా ఊహిస్తమా ? కానీ జైపూర్ లోని ఓ ఫ్లై ఓవర్ పై అలాంటి ఘటనే జరిగింది.
ఆడీ కారు.. ఫ్లైఓవర్ దిగుతుండగా.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొంది. కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు అతను రోడ్డు దాటుతుండగా.. ఆడీ కారు ఢీకొట్టింది. ఆ కారుని ఓ యువతి నడుపుతోండగా పక్కన మరో యువతి కూడా ఉంది. ఆ ఆడీ కారు ఆ వ్యక్తిని ఎంత బలంగా ఢీ కొందంటే అతను 30 అడుగుల దూరంలో అదీ ఓ రెండస్తుల భవనంపై పడ్డాడు. కాలు విరిగి తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు.