రాత్రిపూట తినకూడని ఆహారపదార్థాలు..

-

మనం రోజూ తినే ఆహారపదార్థాలలో రాత్రిపుట తినకూడని పదార్థాలు చాలా ఉన్నాయి. పొద్దునపూట ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు, రాత్రిపూట తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయం తెలుసా.. అలాంటి ఆహార పదార్థాలేంటో తెలుసుకుని, రాత్రిపూట వాటి నుండి దూరంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.

ఐస్ క్రీమ్:

రాత్రిపూట స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ తినడం బాగానే ఉంటుంది. కానీ అందులో ఉండే అధిక చక్కెర శాతం నిద్రని దూరం చేస్తుంది. అధిక చక్కెర, జీర్ణం అవడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. దానివల్ల నిద్ర పాడవుతుంది.

ఆల్కహాల్:

సాధారణంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రాత్రిపూటే సేవిస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల మరుసటి రోజు తీవ్ర అలసత్వంతో బాధపడాల్సి ఉంటుంది. ఆల్కహాల్ సేవించి తొందరగా నిద్రపోదామనుకునే ఆలోచనలో మరుసటి రోజు అలసత్వం గురించి మర్చిపోతారు.

మాంసం:

మాంసం జీర్ణం కావడానికి తీసుకునే సమయం చాలా ఎక్కువ. రాత్రిపూట మాంసం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మీద భారం పడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్ర పాడవుతుంది.

టీ, కాఫీ:

కాఫీలో ఉండే కెఫైన్ బ్లడ్ ప్రజర్ ని ఎక్కువ చేసి ఉత్తేజాన్ని ఇస్తుంది. దీని కారణంగా నిద్ర తొందరగా రాదు. అది మీ తర్వాతి రోజుపై ప్రభావం చూపుతుంది.

టమాట:

టమాట ఉదయం పూట తీసుకోవడం ఎంత మంచిదో రాత్రిపూత దానికి దూరంగా ఉండడం అంత మంచిది. దానిలో ఉండే అధిక శాతం విటమిన్ సి, జీర్ణం కావడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది.

క్యాబేజీ, క్యాలిఫ్లవర్:

వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణం అవడానికి టైమ్ తీసుకుంటుంది. పొద్దునపూట వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల నిద్ర దూరం అవుతుంది. తొందరగా జీర్ణం కాని ఆహారపదార్థాలు నిద్రని పాడుచేస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version