కుల గణన సర్వే రిపోర్ట్ తప్పుల తడకగా ఉంది : బీసీ జాతీయ అద్యక్షుడు

-

కుల గణన సర్వే రిపోర్ట్ తప్పుల తడకగా ఉంది అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ లెక్కలను తక్కువ చేసి అగ్ర కులాల జనాభాను ఎక్కువ చేసి చూపించడం ఇది బీసీలను అమనిచడమే. 2014 లో బీసీలు 51 శాతం ఉంటే 2014 లో 46 శాతం ఉంటాడా.. కుల గణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను మోసం చేసింది.. ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం.

2014 నుంచి 2024 వరకు 21లక్షల మంది బిసిలను తక్కువ చేసి చూపించారు. Ews రిజర్వేషన్లను కాపాడడం కోసం లేని అగ్రకులాల జనాభాను చూపించడం పెద్ద కుట్ర. బిసిలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. బీసీ సబ్ కమిటీకి భట్టి, పొన్నం ఉండాలి కానీ ,ఉత్తమ్ ఎలా ఉంటాడు. సమగ్ర కుల సర్వే రిపోర్ట్ ను ప్రజల ముందు బయట పెట్టాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వే రిపోర్ట్ లను చెత్తబుట్టలో వేస్తాం. ఈ నెల 5న బీసీ సంఘాలు, మేధావులతో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటాం. మళ్ళీ బీహార్ తరహాలో రెండో సారి కుల గణన సర్వే చేయాలి. బీసీ కుల గణన సర్వే పై ప్రభుత్వం పున సమీక్ష చేయాలి. అలా చేయకుంటే కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలు అని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version