కరోనా ఆంక్షలు బ్రేక్….జల్లికట్టు షురూ…!

-

సంక్రాంతి పండగ అంటే తెలుగు రాష్ట్రాల్లో కోడిపందాలు ఎంత పాపులరో తమిళనాడులో జల్లికట్టు కూడా అంతే ఫేమస్. సంక్రాంతి పండుగకు సాంప్రదాయకంగా జల్లికట్టు నిర్వహిస్తుంటారు. గతంలో జల్లికట్టు ప్రమాదకరమైన క్రీడ అని నిషేధించాలంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ సాంప్రదాయ క్రీడను అదుపు చేయలేకపోయారు. ఇక తాజాగా జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 150 మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ జల్లి కట్టును చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అంతేకాకుండా కరోనా నిబంధనలు బ్రేక్ చేశారు. ముఖాలకు మాస్క్ లు ధరించకుండా ఇష్టం వచ్చినట్టు కనిపిస్తున్నారు. మధురై లోని అవనియాపురం లో జల్లికట్టు ప్రారంభించిన కొద్ది సేపటికే ఎద్దు దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version