ఇటీవల కొత్తగా కొలువుదీరిన జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అసెంబ్లీ రసాభాసగా మారాయి. సీఎం ఒమర్ అబ్దుల్లా లీడర్ ఆఫ్ ది హౌస్గా వ్యవహరిస్తున్నారు. దశాబ్దం తర్వాత అక్కడి అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ రాష్ట్రపతి పాలన అమలో ఉంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది.
తాజాగా జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ, అధికార నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఆర్టికల్ 370పై తీర్మానానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు పట్టుబట్టారు. ఆర్టికల్ 370, సెక్షన్ 35a మళ్లీ తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే AIP నేత ఖుర్షీద్ ఆర్టికల్ 370 తీసుకురావాలని బ్యానర్ ప్రదర్శించగా.. దాన్ని బీజేపీ సభ్యులు చించివేశారు. సభలో గందరగోళం నెలకొనగా సభను వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు.