జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల వేట కోనసాగుతోంది. వరసగా గత కొన్ని రోజుల నుంచి భద్రతా బలగాలు వేటను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలువురు లష్కర్ తోయిబా, జైష్ ఏ మహ్మద్, హిజ్భుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు సంస్థలకు చెందిన పలువురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతాబలగాలు. తాజాగా జమ్మూ కాశ్మర్ లో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పుల్వామా జిల్లా గండిపోరాలో సోమవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్క సమాచారంతో సీఆర్ఫీఎఫ్, కాశ్మీర్ పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతమార్చారు. నిషేదిత జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇటీవల కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రిన్ భట్ ను కాల్చిచంపిన ఉగ్రవాదులను 24 గంటల్లోనే ఖతం చేశాయి భద్రతాబలగాలు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదులకు గతంలో కానిస్టెబుల్ రియాజ్ అహ్మద్ ను చంపిన నేరంలో భాగస్వామ్యం ఉందని భావిస్తున్నారు.