జమ్మూ కాశ్మీర్ లో మరోసారి తుపాకులు గర్జించాయి. భద్రతా బలగాలకు కీలక విజయం దక్కింది. తాజాగా శనివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. శ్రీనగర్ లోని జకురా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. కరడుగట్టిన టెర్రరిస్ట్ సంస్థ లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ దిరెసిస్టెంట్ ఫోర్స్ కు సంబంధించిన ఉగ్రవాదులుగా భద్రతా బలగాలు గుర్తించాయి. మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరిని ఇఖ్లాక్ హజామ్ గా గుర్తించారు. గతంలో ఇతరు అనేక ఉగ్రకార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
గతంలో హసన్‌పోరా అనంత్‌నాగ్‌లో ఇటీవల జరిగిన హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ గనీ హత్యలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఇఖ్లాక్ హజామ్ ప్రమేయం ఉంది. 2 పిస్టల్స్‌తో సహా నేరారోపణ సామాగ్రి స్వాధీనం చేసుకుందని ఐజీపీ తెలిపాడు.
కుల్గాం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా నియమితులైన గనీని జనవరి 29న హసన్‌పోరాలో అనుమానిత ఉగ్రవాదులు కాల్చిచంపారు. అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరాలోని తబలా ప్రాంతంలోని అతని నివాసం సమీపంలో ముష్కరులు అతనిపై కాల్పులు జరిపారు.