సినిమాల‌కు గుడ్‌బై.. కామెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం

-

ప్ర‌త్యేక స్లాంగ్‌తో త‌న‌కంటూ కామెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామ‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక సినిమాలు చేయ‌బోన‌ని తన ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించాడు. 2022 సంవ‌త్స‌రం వ‌ర‌కే సినిమాల‌లో న‌టిస్తాన‌ని.. త‌ర్వాత సినిమాల‌కు, న‌ట‌కు దూరంగా ఉంటాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. అలాగే ఈ విషయంలో ఎవ‌రూ చెప్పిన త‌ను విన‌ను అని కూడా క్యాప్షన్ పెట్టాడు. కాగ అర్జున్ రెడ్డి తో పాటు ప‌లు సినిమాల‌లో క‌మెడియ‌న్ న‌టించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని రాహుల్ రామ‌కృష్ణ గెలుచుకున్నారు.

అలాగే ఇటీవ‌ల విడుద‌ల అయిన జాతీ ర‌త్నాలు సినిమాతో రాహుల్ రామ‌కృష్ణ క్రేజీ పిక్స్ కు వెళ్లింది. అయితే కేరీర్ పీక్స్ లో ఉన్న సంద‌ర్భంలో రాహుల్ రామ‌కృష్ణ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంపై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఏప్రిల్ నెల రాలేదు కాదా.. ఫుల్ చేయ‌డానికి అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇదో ఒక ఫ్రాంట్ అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.

అలాగే మ‌రి కొంత మంది.. ఇది సినిమా లేదా వెబ్ సిరీస్ ప్ర‌మోషన్స్ లో భాగంగా ఇలాంటి పోస్టు పెట్టాడ‌ని కామెంట్ చేస్తున్నారు. కాగ రాహుల్ రామ కృష్ణ ట్విట్ట‌ర్ లో ఎందుకు ఆ పోస్టు పెట్టార‌నే విషయం తెలియాల్సి ఉంది. అలాగే రాహుల్ రామ కృష్ణ నిజంగానే న‌ట‌నకు దూరం అవుతున్నాడా.. లేక సినిమా కోసం ఇలా పోస్టు పెట్టారా.. అని తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version