కాంగ్రెస్ వరి దీక్ష నేటితో ముగిసింది. వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ దీక్షలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎప్పడు అభిమానిస్తే అప్పడు అధికారంలోకి వస్తామని జానా రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండింటిని పక్కకు నెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకువస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ప్రజలు అవసరమని భావించేలా పనిచేయలని నేతలకు, కార్యకర్తలకు సూచించారు. అభిప్రాయాలను పక్కన పెట్టి సమస్యల కోసం ఏకం అవ్వడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు.
మీ ఇద్దరిని పక్కకు నెట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారు.- జానారెడ్డి.
-