ఏపీ లో కొత్తగా 178 క‌రోనా కేసులు.. 6 మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల లో 178 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,72,624 కు చేరింది. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల లో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ అత్య‌ధికంగా 6 మృతి చెందారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మృతి చెందిన వారి సంఖ్య‌14,438 కి చేరింది.

అయితే గ‌త కొద్ది రోజుల నుంచి క‌రోనా కాటు కు బ‌లి అయిన వారి సంఖ్య లో ఇదు అత్య‌ధికం. అలాగే ఈ రోజు రాష్ట్రం లో 190 మంది క‌రోనా జ‌యించి పూర్తి ఆరోగ్యం గా కోలుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తం గా ప్ర‌స్తుతం 2,140 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ నుంచి కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ‌స్తున్న నేప‌థ్యం లో ప్ర‌జలు మ‌రింత జాగ్ర‌త్త గా ఉండాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. త‌ప్పని స‌రి గా క‌రోనా వైర‌స్ నిబంధ‌న‌ల ప్ర‌కారం జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version