వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం బాగుపడాలంటే కచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని నాదెండ్ల మనోహర్ అన్నారు. జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని, దౌర్జన్యాలు పెరిగాయని, అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్. జగన్ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చిన్న చిన్న సమస్యలు కూడా కొలిక్కి రాకపోవటం చాలా దారుణమని నాదెండ్ల మనోహర్ అన్నారు.
క్షేత్రస్థాయిలో సమస్యలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. బటన్లు నొక్కుతున్నాము అని ప్రకటనలకు, ఆర్భాటాలకు పోతున్నారు నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. సంక్షేమం కోసం వేల కోట్ల అప్పులు చేస్తున్నామని చెప్పటం ఏమిటి? మరి ఆ డబ్బు మొత్తం ఏమవుతోంది? వృద్ధుల పెన్షన్లు పనిగట్టుకుని తీసివేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.