ఎవరికైనా ఓటమి పాఠాలు నేర్పుతుంది. దాని నుంచి నేర్చుకున్న పాఠాలతో .. నాయకులు కానీ, వ్యక్తులు కానీ ముందుకు సాగేందుకు అద్భుతమైన ప్రణాళిక వేసుకుని ప్రయాణం సాగిస్తారు. ఈ విషయంలో పార్టీ లు ఇంకా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతాయని అందరూ అనుకుంటారు. కానీ, పువ్వు పుట్టగానే పరి మళిస్తుందని ఆశలు పెట్టుకున్నా.. పరిమళించని జనసేన విషయంలో ఇలాంటి వ్యూహాలు మనకు ఎక్క డా కనిపించడం లేదు. పార్టీ అధినేత పవన్ ఆ మేరకు దూకుడును ఎక్కడా చూపించలేక పోతున్నారు.
ఇప్పటికీ.. తను వేస్తున్న అడుగులపై ఆయనలో ఎక్కడా ఆలోచన కనిపించడం లేదు. నేటి యువత ఏం కోరుకుంటున్నారు? పార్టీలో ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు? వ్యూహాత్మకంగా ఎలా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు? ఇప్పుడున్న వాతావరణంలో ఎలాంటి వ్యూహాలను అనుస రి స్తే.. పార్టీకి మేలు చేకూరుతుంది? అనే కనీస విషయాలపై పవన్ దృష్టి పెట్టలేక పోతున్నారని అంటున్నారు పరిశీలకులు. పాడిందే పాట మాదిరిగా.. తనకు అధికారంపై వ్యామోహం లేదని చెబుతున్నారు.
అయితే, అన్నా హజారే మాదిరిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న నాయకులు చేస్తున్న వ్యాఖ్యలుగా అనిపిస్తున్నాయని అంటున్నారు. ఏదైనా పార్టీ అంటే.. ఓటములు, గెలుపులు సర్వసాధారణం. అయితే, అసలు పార్టీలో ఉత్తేజం నింపే కార్యక్రమాలు మానేసి.. హితోక్తులు, సినిమా డైలాగులు చెబితే.. రాజకీయ పార్టీ పుంజుకుంటుందా? అనేది కీలక అంశంగా మారింది. ప్రస్తుతం వర్షాల సీజన్. మరోపక్క, నదులు పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఇసుకకు ఇబ్బందేనని అందరికీ తెలిసిందే.
దీనినిపట్టుకుని.. చంద్రబాబు లాంటి వారు ఊగిసలాడితే..వేరే పరిస్థితి కానీ, పవన్ లాంటి మేదావికూడా ఇప్పుడు దీనినే పట్టుకుని వేలాడితే.. ఎలా అని అంటున్న వారు కూడా కనిపిస్తున్నారు. ఏదేమైనా. నిర్మాణాత్మక శైలిలో రాజకీయాలు చేస్తున్న తీరు కనిపించడం లేదని, ఇలా అయితే జనసేన ఇబ్బంది పాలు కాకతప్పదని సూచిస్తున్నారు మరి పవన్ వింటారా? పంథా మార్చుకుంటారా? చూడాలి.