రాంబాబు రాసలీలలు, పారిపోయిన అంబటి పేరుతో సినిమాలు తీస్తాం -జనసేన

-

రాంబాబు రాసలీలలు,పారిపోయిన అంబటి పేరుతో సినిమాలు తీస్తామని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తే వైసిపి వాళ్లకు తడిచిపోతుందని.. మంత్రులుగా పాత పాలేరులు స్గానంలో కొత్త పాలేరులు వచ్చారన్నారు. నేరస్తుడు అనే టైటిల్ తో మీ నాయకుడిపై సినిమా రాబోతుంది.

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్ మెన్ కొట్టిన విషయం మర్చిపోయావా అంబటి అని నిలదీశారు. అంబటి చరిత్ర అంతా చీకటి మయం… అంబటి ని ఎంత మంది మహిళలు చెప్పులతో కొట్టారో చర్చ పెడదామా ? అని నిలదీశారు.

నీ శాఖ గురించి ఏమైనా తెలుసా అంబటి.. రేపల్లె నుంచి ఎందుకు పారిపోయి వచ్చావో సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను పరామర్శించడం తప్పు అని దమ్ముంటే ప్రకటన చేయండని.. మీ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. అంబటిపై సినిమాలు తీయడానికి జలవనరుల శాఖ గెస్ట్ హౌస్ లు చాలు… నోరు అదుపులోకి పెట్టుకోకపోతే అంబటి కుటుంబ చరిత్ర అంతా సీరియల్ తీస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version