రౌడీకి జోడీగా జాన్వీ కపూర్ ఫిక్స్ అయిన‌ట్టేనా..?

-

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రూపొందుతోంది. ఆ తర్వాత పూరీ జ‌గ‌న్నాథ్‌.. స్పెషల్ యాటిట్యూడ్ ఉన్న విజయ్ దేవరకొండతో `ఫైటర్‌` సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. స్టైల్‌ కా బాప్‌లుగా పేర్కొనే ఇద్దరు కలిసి చేయబోతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జొహార్ భాగస్వామి కావడంతో, తెలుగుతో పాటు ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

అందువలన బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఆ జాబితాలో అలియా భట్ .. సారా అలీఖాన్ .. జాన్వీ కపూర్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. అయితే జాన్వీ కపూర్ ని ఖరారు చేశారనేది తాజా సమాచారం. అడ్వాన్స్ గా ఆమెకి కోటి రూపాయలు కూడా ఇచ్చారని అంటున్నారు. జాన్వీ కపూర్ ను ఒప్పించడంలో కరణ్ జొహార్ ప్రధానమైన పాత్రను పోషించాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version