అంబానీ ఇంటికి జాన్వీ కపూర్..ఫోటోలు వైరల్

-

అంబానీల ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముంబయిలోని ఆంటాలియా ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్‌ అంబానీకి విరెన్‌ మర్చంట్‌, శైల దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌ నిశ్చితార్థం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. గుజరాతీ హిందూ కుటుంబ సంప్రదాయాలను అడుగడుగునా పాటించారు.

తొలుత అనంత్‌ సోదరి ఈషా అంబానీ మర్చంట్‌ ఇంటికి వెళ్లి వారిని వేడుకకు ఆహ్వానించడంతో నిశ్చితార్థ వేడుక ప్రారంభమైంది. సాయంత్రం అంబానీ నివాసానికి చేరిన మర్చంట్‌ కుటుంబానికి అంబానీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత శ్రీకృష్ణ మందిరంలో ఇరువురు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నిశ్చితార్థ వేదికపైకి చేరుకున్నారు. గణపతి ఆరాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించాక వివాహ ఆహ్వాన పత్రికను అందరికీ చదివి వినిపించారు.

గుజరాతీ సంప్రదాయాలైన గోల్‌ధన, చునారి విధి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. నీతా అంబానీ నేతృత్వంలో అంబానీ కుటుంబం చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో అనంత్‌, రాధిక ఉంగరాలు మార్చుకున్నారు. అయితే, ఈ వేడుకలో జాన్వీ కపూర్‌ హడావిడీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version