కల్లు గీత కార్మికులకు ఏపీ సర్కార్‌ రూ.10 లక్షల పరిహారం

-

ఏపీ గీత కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. కల్లుగీత కార్మికులు కల్లుగీస్తూ, ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే రూ. 10 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వైఎస్సార్ బీమా పథకం కింద రూ. 5,00,000, ఎక్స్ గ్రేషియో రూపంలో మరో 5,00,000 చెల్లించనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ. 10 లక్షలు పరిహారం అందిస్తోంది. తాజాగా శాశ్వత వైకల్యం బారిన పడినా రూ. 10 లక్షలు ఇస్తామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version